రూ.60 లక్షల మద్యం ధ్వంసం..శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట రోడ్డు రోలర్ తో తొక్కించారు

రూ.60 లక్షల మద్యం ధ్వంసం..శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ఎదుట రోడ్డు రోలర్ తో తొక్కించారు

హైదరాబాద్ సిటీ, వెలుగు: అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తీసుకువస్తుండగా పట్టుబడ్డ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు బుధవారం ధ్వంసం చేశారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ పి. దశరథ్ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ ముందు రోడ్డు రోలర్​తో తొక్కించి పగలగొట్టారు.

6 నెలలుగా శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ ద్వారా ఢిల్లీ, గోవా, హర్యానా తదితర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తీసుకువస్తున్న 6,859 మద్యం బాటిళ్లు, 44 బీరు బాటిళ్లను పట్టుకున్నారు. వీటన్నింటిని ధ్వంసం చేయగా వీటి విలువ రూ. 60 లక్షలు ఉంటుందన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, ఏఈఎస్ శ్రీనివాసరెడ్డి, సీఐ దేవేందర్ రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

ఏపీ బ్రీజర్ అమ్మకాలపై దాడులు

తెలంగాణలో బ్రీజర్ నిల్వలు తక్కువగా ఉన్నాయనే ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ఏపీకి చెందిన బ్రీజర్‌‌‌‌లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కూకట్‌‌‌‌పల్లి ప్రాంతంలోని 34 మద్యం దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 15 ఏపీకి చెందిన బ్రీజర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.